పాముల బెడద.. పిచ్చి చెట్లు తొలగింపు

పాముల బెడద.. పిచ్చి  చెట్లు తొలగింపు

NLR: బుచ్చి పట్టణంలోని ఖాజా నగర్‌లో ఉన్న గుడిపల్లి కాలువ వద్ద పిచ్చి చెట్లు ఎక్కువయ్యాయి. దీంతో ఆ ప్రాంతంలో పాములు సంచరిస్తూ ఉండడంతో స్థానిక ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఈ సమస్యను స్థానిక టీడీపీ నాయకుడు సుభహాని అధికారులు, ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పారిశుద్ధ్య కార్మికులు చెట్లను, కాలువలో ఉన్న చెత్తను తొలగించారు.