భర్తను తలుచుకుని ఎమోషనల్ అయిన మంత్రి సీతక్క
MLG: తన భర్త కుంజ రాము ఆశయాలే నా పయనం అని మంత్రి సీతక్క అన్నారు. శుక్రవారం కొత్తగూడ(M) మోకాళ్లపల్లి గ్రామంలో కుంజ రాము 22వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. సీతక్క కుటుంబ సభ్యులతో కలిసి స్థూపం వద్ద పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. 'కుంజ రాము నా భర్త మాత్రమే కాదు. నా పోరాటానికి మార్గదర్శి. ఆదివాసీల కోసం ఆయన జీవితాన్నే అంకితం చేశారని భావోద్వేగానికి లోనయ్యారు.