మహిళల భద్రతకు ‘షీ టీమ్స్’ అవగాహన

మహిళల భద్రతకు ‘షీ టీమ్స్’ అవగాహన

BDK: పినపాక మండలం, ఏడూళ్ల బయ్యారం క్రాస్ రోడ్ వద్ద మహిళల భద్రతపై అవగాహన కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఏఎస్ఐ మల్సూర్ మాట్లాడుతూ.. వేధింపులకు గురైన మహిళలు, విద్యార్థినులు భయపడకుండా పోలీసులను సంప్రదించాలని సూచించారు. ఈవ్ టీజింగ్, సోషల్ మీడియా వేధింపులపై అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే 100కు కాల్ చేయాలని సూచించారు.