కల్లులో పురుగులు.. శాంపిళ్లను సేకరించిన ఎక్సైజ్ అధికారులు

VKB: కోట్‌పల్లి మండలం మెతుకుపల్లిలో కల్లులో పురుగులు కనిపించిన ఘటనను ఎక్సైజ్ అధికారులు తీవ్రంగా పరిగణించారు. తాండూర్ ఎక్సైజ్ అధికారులు ఆ కల్లు దుకాణానికి వెళ్లి, కల్లు తయారు చేయడానికి ఉపయోగించే ముడిపదార్థాలను పరిశీలించారు. అంతేకాకుండా, కల్లు శాంపిళ్లను సేకరించారు. వీటిని పరీక్షల కోసం పంపించారు. రిపోర్టు వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.