విద్యుత్ ఘాతానికి గురై రైతు మృతి

విద్యుత్ ఘాతానికి గురై రైతు మృతి

వరంగల్: సంగెం మండలం వీఆర్ఎన్ తండాలో శుక్రవారం ఓ రైతు విద్యుత్ షాక్‌కు గురై ప్రాణాలు కోల్పోయాడు. గ్రామానికి చెందిన గుగులోత్ సురేష్ (28) అనే రైతు పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లాడు. మోటారు వేసే క్రమంలో విద్యుత్ షాక్ గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. రైతు సురేష్ మృతితో కుటుంబ సభ్యుల రోదన వర్ణనాతీతంగా మారగా గ్రామంలో విషాద ఛాయలు అమ్ముకున్నాయి.