మహిళా దినోత్సవం వేడుక కాదు.. 'పోరాట స్మరణ'
NLG: మహిళా దినోత్సవం సందర్భంగా నల్గొండలోని యూటీఎఫ్ ఆఫీసులో ఐద్వా, సీఐటీయూ తదితర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జిల్లా సదస్సు నిర్వహించారు. తుమ్మల పద్మ, కుంచెం కావ్య, శ్రీవాణి అధ్యక్షత వహించిన ఈసభలో ఐద్వా కేంద్ర కమిటీ సభ్యురాలు పాలడుగు ప్రభావతి మాట్లాడుతూ.. మహిళా దినోత్సవం కేవలం వేడుక కాదని, శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా, సమాన హక్కుల కోసం జరిగిన 'పోరాట స్మరణ' అన్నారు.