డిగ్రీ కళాశాల పరీక్ష షెడ్యూల్ విడుదల
పెద్దపల్లి జిల్లా మంథని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఓపెన్ డిగ్రీ థర్డ్ సెమిస్టర్ విద్యార్థులకు పరీక్షల షెడ్యూల్ విడుదల అయింది. పరీక్షలు ఫిబ్రవరి 13- 20 వరకు జరుగుతాయి. మహా శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 19న సెలవు ప్రకటించారు. పరీక్ష ఫీజు చెల్లింపు 27 వరకు కొనసాగుతుంది.