'కార్మికులకు అండగా ఉంటా'
VSP: షిప్‌యార్డ్ కార్మికుల సమస్యల పరిష్కారానికి తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే పి.గణబాబు భరోసా ఇచ్చారు. ఆదివారం హిమచల్‌నగర్‌లో షిప్‌యార్డ్ టీఎన్‌టీయుసీ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. షిప్‌యార్డ్ అభివృద్ధిలో కార్మికుల కృషి ఎంతో కీలకమన్నారు.