VIDEO: గాయపడిన భారీ కొండచిలువ కలకలం
HNK: కమలాపూర్ మండల కేంద్రంలో బుధవారం తెల్లవారుజామున రోడ్డు దాటుతుండగా భారీ కొండచిలువ గాయాల పాలయ్యింది. దీనిని చూసిన వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. విషయం అటవీశాఖ అధికారులకు తెలియజేసినా స్పందన లేకపోవడంతో గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొండచిలువకు చికిత్స అందించి సురక్షితంగా అటవీ ప్రాంతానికి తరలించాలని స్థానికులు కోరుతున్నారు.