రూ.100 కోసం దారుణ హత్య

రూ.100 కోసం దారుణ హత్య

MNCL: జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. దండేపల్లిలో రూ.100 కోసం ఓ దుండగుడు దంపతులపై దాడి చేశాడు. ఈ ఘటనలో భర్త శంకరయ్య తీవ్రగాయాలతో మృతి చెందగా, భార్య పరిస్థితి విషమంగా ఉంది. గమనించిన స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. నిందితుడు అదే గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.