వీవీఐపీల ప్రాంతంలో అప్రమత్తత అవసరం: కమిషనర్
కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ సత్యనారాయణ మంగళవారం ఆఫీసర్స్ కాలనీలో పర్యటించి పారిశుద్ధ్యం పనులను తనిఖీ చేశారు. కలెక్టర్, జేసీ, ఆర్డీవో వంటి వీవీఐపీలు నివసించే ప్రాంతాల్లో శానిటేషన్ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. పనులపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని అధికారులకు సూచించారు. క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్యం మెరుగుపరచాలని స్పష్టం చేశారు.