శ్రీ ఉమా రుద్ర కోటేశ్వర ఆలయం మూసివేత
శ్రీకాకుళం గుడి వీధిలో ఉన్న శ్రీ ఉమారుద్ర కోటేశ్వర ఆలయం మూసివేయడం జరుగుతుందని దేవాదాయ శాఖ ఈవో సుకన్య తెలిపారు. ఆదివారం శ్రీకాకుళంలో ఒక ప్రకటన విడుదల చేస్తూ ఈనెల 3 తేదీన చంద్రగ్రహణం సంభవిస్తున్న సందర్భంగా అదే రోజు ఉదయం 10 గంటలకు మూసివేయడం జరుగుతుందన్నారు. తిరిగి 4 తేదీ సంప్రోక్షణ కార్యక్రమాల అనంతరం 6 గంటలకు తెరుస్తామన్నారు.