VIDEO: బ్రహ్మసముద్రంలో ఘనంగా శ్రీనివాస కళ్యాణం
సత్యసాయి: సోమందేపల్లి మండలం బ్రహ్మసముద్రం గ్రామంలో శ్రీనివాస కళ్యాణం కార్యక్రమం శనివారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని ఆలయ ప్రాంగణంలో వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య శ్రీనివాస స్వామివారి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.