NEET పరీక్షకు భారీ భద్రత

NEET పరీక్షకు భారీ భద్రత

వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే NEET పరీక్షకు సర్వం సిద్దమైంది. రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరగనుంది. మధ్యాహ్నం 1:30 వరకు పరీక్షా కేంద్రాల్లోకి అభ్యర్థులను అనుమతించనున్నారు. ఇంగ్లీష్‌, తెలుగు, హిందీ వంటి 13 భాషల్లో పరీక్ష ఉంటుంది. గతేడాది నీట్ పరీక్షలో అవకతవకలు జరిగిన నేపథ్యంలో సెంటర్ల వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.