కుప్పంలో మెడికల్ విద్యార్థి మృతి
CTR: కుప్పం PES మెడికల్ కాలేజీలో PG అనస్థీషియా ఫస్ట్ ఇయర్ విద్యార్థి హర్షవర్ధన్(25) మృతిచెందాడు. అనంతపురానికి చెందిన అతను హాస్టల్ గదిలో అపస్మారక స్థితిలో పడి ఉండడాన్ని తోటి విద్యార్థులు గుర్తించారు. అతనికి సీపీఆర్ చేస్తుండగా కార్డియాక్ అరెస్ట్‌తో మృతిచెందాడు. హర్షవర్ధన్ హైడోస్ ఇంజెక్షన్ వేసుకోవడంతో కార్డియాక్ అరెస్ట్ జరిగినట్లు తెలుస్తోంది.