కంచికచర్లలో బెంబేలెత్తిస్తున్న కోతులు

కృష్ణా: కంచికచర్లలో కోతులు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. గుంపులుగా ఇళ్లల్లోకి చొరబడి వస్తువులు ఎత్తుకెళ్తున్నాయని, మనుషులపై దాడులు చేస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. పంచాయతీ అధికారులు స్పందించి కోతులను పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టాలని వారు కోరుతున్నారు.