రేపటి నుంచి ఆలయంలో లక్ష ప్రదక్షిణల కార్యక్రమం
అనకాపల్లి పట్టణం గవరపాలెం వద్ద గల జగన్నాథ స్వామి ఆలయంలో ఈనెల 16వ తేదీ నుంచి లక్ష ప్రదక్షిణల కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆలయ ఛైర్మన్ దాడి బుజ్జి తెలిపారు. ఈ మేరకు ఆలయంలో గోడపత్రికను ఆవిష్కరించారు. వచ్చేనెల 16వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు.