VIDEO: అధికారుల నిర్టక్ష్యం.. ఖాళీగా MPDO కార్యాలయం
NZB:వేల్పూర్ మండల కేంద్రంలోని MPDO కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం వేళ సిబ్బంది ఒక్కరూ కూడా లేకపోవడంతో కార్యాలయానికి వచ్చిన ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కార్యాలయం తలుపులు తెరిచి ఫ్యాన్లు, లైట్లు వేసిన సిబ్బంది ఒక్కరూ కూడా తమ సీట్లలో లేకుండా పోవడంతో విమర్శిస్తున్నారు. కనీసం సమాధానం చెప్పేందుకు అటెండర్ కూడా లేకపోవడం విడ్డూరంగా ఉందని వాపోతున్నారు.