గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్

గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్

 HNK: శాయంపేట మండల కేంద్రంలోని కస్తూర్బా గురుకుల ఆశ్రమ పాఠశాలను జిల్లా కలెక్టర్ ప్రావీణ్య నేడు ఆకస్మికంగా సందర్శించి పలు విభాగాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులతో ఆమె మాట్లాడుతూ.. పదవ తరగతి పరీక్షల్లో విద్యార్థులు చక్కటి ఫలితాలు సాధించేలా కలిసికట్టుగా కృషి చేయాలని ఆదేశించారు. విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు.