కౌన్సిలర్లను అభినందించిన మాజీ మంత్రి
KMM: వైరా మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులను మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఖమ్మంలోని తన క్యాంపు కార్యాలయంలో సన్మానించారు. బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఐదుగురు కౌన్సిలర్లతో పాటు సీపీఎం, సీపీఐ విజేతలను ఆయన అభినందించారు. మున్సిపాలిటీలో గులాబీ జెండా ఎగరడంపై హర్షం వ్యక్తం చేస్తూ, వార్డుల అభివృద్ధికి కృషి చేయాలని వారికి సూచించారు.