క్యాన్సర్ బాధితుడికి రూ.5 లక్షల ఎల్ఓసీ అందజేసిన ఎమ్మెల్యే

క్యాన్సర్ బాధితుడికి రూ.5 లక్షల ఎల్ఓసీ అందజేసిన ఎమ్మెల్యే

WGL: పర్వతగిరి మండలం దౌలత్‌నగర్ బాజీ తండాకు చెందిన మాలోత్ పరమేష్ క్యాన్సర్‌తో బాధపడుతున్న నేపథ్యంలో చికిత్స కోసం రూ.5 లక్షల విలువైన ఎల్ఓసీ కాపీని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అందజేశారు. ఆదివారం హైదరాబాద్‌లోని తన క్యాంపు కార్యాలయంలో బాధిత కుటుంబ సభ్యులకు ఎల్ఓసీ అందించి, ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రిలో చికిత్స పొందేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.