నీటి సమస్యలంటే అధికారులకు ఇంత నిర్లక్ష్యమా?

HYD: నీటి సమస్య ఉంటే యాప్‌లో నమోదు చేయండి.. 155313 నంబరుకు కాల్ చేయండి అని చెప్పే వాటర్ బోర్డు అధికారులు అసలు అవి పనిచేస్తున్నాయో, లేదో చెక్ చేసుకోవాలని నగరవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం నుంచి సోమవారం వరకు జలమండలికి సంబంధించి వెబ్‌సైట్, యాప్, టోల్ ఫ్రీ నంబర్ పనిచేయకపోవడంతో ప్రజలు నీటి కోసం నరకయాతన అనుభవించారు.