ఆలయ అర్చకుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు
GDWL: జోగులాంబ బాల బ్రహ్మేశ్వర ఆలయంలో అర్చకుడిగా పనిచేస్తున్న ఆనంద్ శర్మపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఎ. బూడిదపాడు గ్రామ సర్పంచ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. శివరాత్రి పర్వదినం రోజు అర్చకుడు కులం పేరుతో దూషించాడని ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు.