VIDEO: మొగిలి ఘాట్లో రోడ్డు ప్రమాదం.. భారీగా ట్రాఫిక్ జామ్
CTR: చెన్నై - బెంగళూరు జాతీయ రహదారిపై మొగిలి ఘాట్లో రోడ్డు ప్రమాదాలు ఆగడం లేదు. బుధవారం ఉదయం రెండు లారీలు ఢీకొనడంతో తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎవరికైనా గాయాలయ్యాయా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. అధికారులు చర్యలు చేపట్టినా ప్రమాదాలు మాత్రం తగ్గలేదు.