లులూ సంస్థ ఏపీకి రావడం శుభసూచకం: నజీర్

కృష్ణా: జగన్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోని పరిశ్రమలను తన స్వార్థం కోసం వేధించాడని టీడీపీ నేత బెజవాడ నజీర్ తెలిపారు. బుధవారం ఆయన పటమటలో మాట్లాడుతూ.. టీడీపీ హయాంలో లులూ సంస్థకు ఇచ్చిన భూమిని జగన్ లాక్కోవడంతో ఇకపై ఏపీకి ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చేది లేదని లులూ చెప్పిందని తెలిపారు. అటువంటి సంస్థను చంద్రబాబు మళ్ళీ ఏపీకి రప్పించడం శుభసూచకమన్నారు.