మామిడి పండు తినే ముందు నీటిలో పరీక్ష
ఒక బకెట్ నీటిలో మామిడి పండ్లను వేయాలి. సహజంగా పండిన పండు నీటిలో మునుగుతుంది. రసాయనాలతో పండించినవి నీటిపై తేలుతాయి. మామిడి పండ్లను తినేముందు కనీసం గంటసేపు నానబెట్టి, ఆపై బాగా కడిగి తొక్క తీసి తినడం వల్ల రసాయనాల ప్రభావాన్ని తగ్గించవచ్చు. విశ్వసనీయమైన రైతుల వద్ద లేదా సేంద్రియ పండ్లను కొనుగోలు చేస్తే ఆరోగ్యానికి మంచిది. నిగనిగలాడే పండ్లను చూసి మోసపోకుండా జాగ్రత్తలు పాటించాలి.