CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

BPT: చుండూరు మండలం మున్నగివారిపాలెం గ్రామానికి చెందిన ముగ్గురు అనారోగ్యంతో బాధపడుతూ.. ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందిన వారికి వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి నుండి ఆర్థిక సాయం మంజూరైంది. రూ. 5,62,766 చెక్కులను వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు లబ్ధిదారులకు, వారి కుటుంబ సభ్యులకు స్వయంగా అందజేశారు.