కీచక ఉపాధ్యాయుడు అరెస్ట్
NLR: వరికుంటపాడు మండలం తూర్పు బోయమడుగుల ప్రాథమికోన్నత పాఠశాలలో ఓ కీచక ఉపాధ్యాయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఏడాది జూలై 1న పాఠశాలలోని విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన అతనికి తల్లిదండ్రులు దేహశుద్ధి చేసిన విషయం తెలిసిందే. దీంతో అక్కడ నుంచి ఉపాధ్యాయుడు పరారు కావడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నిన్న అతడిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.