10న బ్యాడ్మింటన్ జట్ల ఎంపిక పోటీలు

TPT: తిరుపతి శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం కళాశాల మైదానంలో ఈ నెల పదో తేదీన జిల్లా బాల్ బ్యాడ్మింటన్ జూనియర్ బాలుర, సీనియర్ బాలికల జట్ల ఎంపిక పోటీలు జరగనున్నాయి. ఈ మేరకు చిత్తూరు బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి బాలాజి తెలిపారు. కాగా, పూర్తి వివరాలకు 70137 54776 నెంబరును సంప్రదించాలన్నారు.