'ప్రాధాన్యత కార్యక్రమాల అమలుపై అధికారులు దృష్టి సారించాలి'
KMM: ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల అమలుపై మండల ప్రత్యేక అధికారులు దృష్టి సారించాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ జిల్లా అధికారులను ఆదేశించారు. ప్రజావాణి అనంతరం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. మండల ప్రత్యేక అధికారులు ప్రతి శుక్రవారం చేపట్టిన తనిఖీలకు సంబంధించిన అంశాలపై ఆమె మరో అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డితో కలిసి సమీక్షించారు.