మంజీరా నీరు రాక ఇబ్బందులు
VKB: బంట్వారంలో గురువారం మంజీరా నీరు రాక మహిళలు నూతనంగా ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంకుల వద్దకు చేరుకుని నీరు తీసుకెళ్తున్నారు. అయితే ట్యాంకులపై పైకప్పు లేకపోవడంతో పక్షుల వ్యర్థాలు, దుమ్ము ధూళి పడే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే స్పందించి ట్యాంకులపై పైకప్పు నిర్మించాలని గ్రామ పాలకులను మహిళలు కోరుతున్నారు.