గ్రీవెన్స్ డే కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

గ్రీవెన్స్ డే కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

TPT: గూడూరు నియోజకవర్గంలోని వాకాడు మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన ప్రత్యేక గ్రీవెన్స్ డే కార్యక్రమంలో గూడూరు ఎమ్మెల్యే డా. పాశం సునీల్ కుమార్ పాల్గొని, ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. స్వీకరించిన అర్జీలను త్వరతగతిన పరిష్కరించాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.