రాజానగరంలో కోటి సంతకాల సేకరణ విజయవంతం
E.G: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన ప్రజా ఉద్యమంలో భాగంగా రాజానగరం వ్యాప్తంగా సేకరించిన సంతకాల ప్రతులను జక్కంపూడి నాయకత్వంలో మీడియా ముందు ప్రదర్శించారు. అనంతరం కార్ల ర్యాలీగా బొమ్మూరు జిల్లా పార్టీ కార్యాలయానికి తరలించి, జిల్లా అధ్యక్షులు వేణుగోపాల కృష్ణ, పార్లమెంట్ ఇంఛార్జ్ గూడూరి శ్రీనివాస్ గార్లకు అధికారికంగా అందజేశారు.