'తిరుపతి ప్రజలు ఈ నంబర్లు సేవ్ చేసుకోండి'
TPT: తుఫాన్ ప్రభావంతో తిరుపతిలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కార్పొరేషన్ కమిషనర్ మౌర్య చెప్పారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని విభాగాల అధికారులు 24 గంటల అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. సాయం కోసం టోల్ ఫ్రీ 0877-2256776, 9000822909 నంబర్లను అందుబాటులో ఉంటాయని తెలిపారు. కాలువలో చెత్త తొలగింపు, తాగునీటి పరీక్షలు వంటి చర్యలు చేపడతామన్నారు.