నులకజోడు గ్రామానికి నిలిచిన రాకపోకలు

PPM: తుఫాను కారణంగా కురిసిన వర్షాలకు భామిని మండలం నులకజోడు గ్రామానికి వెళ్లే రోడ్డు కింది భాగం కొట్టుకుపోయింది. దీంతో ఆ రోడ్డు ప్రమాదకరంగా మారింది. రాకపోకలు నిలిచిపోవడంతో గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి రాకపోకలకు అంతరాయం లేకుండా చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.