ఆర్మీ అమ్ములపొదిలోకి మరో అస్త్రం

ఆర్మీ అమ్ములపొదిలోకి మరో అస్త్రం

యుద్దనౌక INS తారాగిరిని కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ జాతికి అంకితం చేయనున్నారు. ఈ యుద్ధనౌక విశాఖ కేంద్రంగా సేవలందించనుంది. బ్రహ్మోస్ క్షిపణిని మోసుకెళ్లగల సత్తా ఉన్న తారాగిరి సముద్ర సరిహద్దు రక్షణలో కీలక పాత్ర పోషించనుంది. రాడార్ల కంటికి చిక్కకుండా ఉండే స్టెల్త్ సామర్థ్యంతో రూపొందించబడింది. డీజిల్ లేదా గ్యాస్ వ్యవస్థతో నడవనుంది. విపత్తు నిర్వహణలోనూ కీలక పాత్ర పోషించనుంది.