రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి
KRNL: ఆదోని-నగరూరు రైల్వే ట్రాక్ మధ్యలో శనివారం తెల్లవారుజామున రైలు కిందపడి సుమారు 40 ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆదోని జనరల్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.