VIDEO: వర్షానికి తడిసిన వరి ధాన్యం

VIDEO: వర్షానికి తడిసిన వరి ధాన్యం

HNK: కమలాపూర్ మండలం కేంద్రంలో తుఫాన్ ప్రభావంతో వరి కొనుగోలు కేంద్రాల్లో మంగళవారం కురిసిన వర్షానికి ధాన్యం తడిసి ముద్దయింది. ఈ వర్షం వల్ల కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న ధాన్యం రాశుల చుట్టూ నీరు నిలవడంతో ధాన్యం తడిసిపోయి నష్టం కలిగింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం స్పందించి తడిసిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు.