రేపటి నుంచి నిజామాబాద్‌లో జెండా జాతర

రేపటి నుంచి నిజామాబాద్‌లో జెండా జాతర

NZB: నగరంలోని జెండా బాలాజీ ఆలయం జాతర ఈ నెల 24 నుంచి ప్రారంభమవుతున్నట్లు వంశపారపర్యం అర్చకులు అజయ్ సంగ్వాయి తెలిపారు. ఉదయం 8 గంటలకు పెద్ద బజార్​లోని స్వగృహం నుంచి ఉత్సవమూర్తులను, జెండాను ఆలయానికి శోభాయాత్రగా ఊరేగిస్తున్నట్లు పేర్కొన్నారు. కావున భక్తులు సహకరించి ఆలయంలోనే జెండాను దర్శించుకోవాలని కోరారు.