పుంగనూరు వాసికి రాష్ట్ర కోఆర్డినేటర్ పదవి

CTR: పుంగనూరు పట్టణానికి చెందిన ఎస్.ఆర్. వేంకట ప్రసాద్ శర్మను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాహ్మణ సంఘటన సంస్థ రాష్ట్ర కోఆర్డినేటర్‌గా నియమించింది. బుధవారం ఈ మేరకు వ్యవస్థాపక అధ్యక్షుడు వేమూరి ఆనంద్ సూర్య నియామకాన్ని ప్రకటించారు. కాగా, 2025 నుండి 2027 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. ఈ సందర్భంగా శర్మకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.