రంజాన్‌కు పటిష్ఠ భద్రత: ఎస్పీ
BPT: రంజాన్ పండుగకు బాపట్ల జిల్లాలో గట్టి భద్రత ఏర్పాటు చేశామని ఎస్పీ బి.ఉమామహేశ్వర్ తెలిపారు. ముస్లింలకు ఆయన పండుగ శుభాకాంక్షలు చెప్పారు. మసీదులు, ఈద్గాల వద్ద డ్రోన్లు, సీసీ కెమెరాలతో నిఘా ఉంచామన్నారు. సోషల్ మీడియాలో విద్వేషాలు రెచ్చగొడితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ప్రజలంతా శాంతియుతంగా పండుగ జరుపుకోవాలని సూచించారు.