అనారోగ్యంతో 90 ఏళ్ల వృద్ధుడు మృతి
KMM: కామేపల్లి మండలం రామకృష్ణాపురం గ్రామానికి చెందిన ఏపూరి అనంతరామయ్య (90) ఆదివారం ఉదయం అనారోగ్యంతో మృతి చెందారు. గత వారం రోజులుగా ఆయన ఇంట్లోనే అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన మృతితో గ్రామం ఒక పెద్దమనిషిని కోల్పోయిందని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.