స్కూల్ బస్సును ఢీకొట్టిన టాటా ఏస్
KDP: VNపల్లె మండలం తంగేడుపల్లె సమీపంలో శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. పాఠశాల విద్యార్థులను ఎక్కించుకునేందుకు నిలిపిన ఓ ప్రైవేట్ పాఠశాల స్కూల్ బస్సును వెనుక వైపు నుంచి కూలీలతో వస్తున్న టాటా ఏస్ వాహనం ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే ఆ వాహనం డ్రైవర్ పారిపోయాడు. అందులోని ఓ మహిళా కూలీ గాయపడ్డారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.