సిట్ దూకుడు.. వారి ఆస్తులపై ఫోకస్
AP: లిక్కర్ స్కాం కేసులో సిట్ దూకుడు పెంచింది. ఈ కేసులో నిందితులుగా ఉన్నవారి ఆస్తులపై ఫోకస్ పెట్టిన సిట్.. ఆయా వివరాలు తెలియజేయాలని ఇప్పటికే తమిళనాడు ఐజీకి లేఖ రాసింది. మొత్తం 16 మంది వివరాలు కోరగా సదరు ఉన్నతాధికారి నుంచి ఎలాంటి స్పందన. దీంతో నిందితుల ఆస్తుల వివరాలు ఇచ్చేలా TN ఐజీని ఆదేశించాలని విజయవాడ ఏసీబీ కోర్టులో సిట్ పిటిషన్ దాఖలు చేసింది.