తిరువూరులో తప్పిన పెను ప్రమాదం

తిరువూరులో తప్పిన పెను ప్రమాదం

NTR: తిరువూరు టౌన్‌లో బైపాస్ రోడ్డుపై వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మునుకుళ్ల అంకమ్మ తల్లి దర్శనం ముగించుకుని తెలంగాణ, వేంసూరు మండలం కుంచిపర్తి గ్రామానికి వెళ్తున్న నూతన వధూవరులు బైపాస్ రోడ్డుపై ఆగి ఉన్న లారీని ఢీకొట్టారు. ఈ ఘటనలో వారికి స్వల్ప గాయాలు మాత్రమే అయినట్లు సమాచారం.