ఆర్వో కేంద్రాలను తనిఖీ చేసిన పరిశీలకులు
SRCL: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పలు ఆర్వో కేంద్రాలు, ఎస్ ఎస్ టీ చెక్ పోస్ట్ జిల్లా సాధారణ పరిశీలకులు రవి కుమార్ శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వేములవాడ రూరల్ మండలంలోని చెక్కపల్లి, వట్టిమల్ల ఆర్వో కేంద్రాలు, ఫాజుల్ నగర్ ఎస్ఎస్‌టీ, రుద్రంగి ఆర్ఎ, ఎస్ఎస్‌టీ చెక్‌పోస్ట్‌ను తనిఖీ చేశారు. ఆయా ఆర్వో కేంద్రాల్లో నామినేషన్ల ఏర్పాట్లను పరిశీలించారు.