మహిళలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలి: మంత్రి

మహిళలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలి: మంత్రి

MLG: ఉచిత బస్ ప్రయాణ పథకంపై మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను మంత్రి సీతక్క తీవ్రంగా ఖండించారు. ఆయన వ్యాఖ్యలు మహిళల గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయని, మహిళా లోకానికి కేసీఆర్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నిజంగా ఈ పథకం పనికిరాదని భావిస్తే, దాన్ని రద్దు చేస్తామని చెప్పే ధైర్యం ఉందా..? అని సూటి ప్రశ్న వేశారు.