పుంగనూరులో పోలీసుల ఆయుధ పూజ

పుంగనూరులో పోలీసుల ఆయుధ పూజ

CTR: పుంగనూరు పోలీస్ స్టేషన్‌లో ఆదివారం రాత్రి ప్రాంతంలో ఘనంగా ఆయుధ పూజ జరిగింది. సీఐ సుబ్బారాయుడు ఆధ్వర్యంలో పోలీస్ ఆయుధాలు, వాహనాలను పూలమాలలు, మామిడి తోరణాలతో అలంకరించారు. వేదమంత్రోచ్ఛారణల మధ్య పూజలు నిర్వహించగా, పోలీసులు ఆయుధాలకు నమస్కరిస్తూ ప్రజల రక్షణకు సేవ చేయాలని సంకల్పం వ్యక్తం చేశారు. ఎస్సై హరిప్రసాద్, ఏఎస్ఐ అశ్వత్ నారాయణ తదితరులు పాల్గొన్నారు.