ఈ విజయం దేశ క్రీడా రంగానికి గౌరవం తెచ్చింది: రేవంత్

ఈ విజయం దేశ క్రీడా రంగానికి గౌరవం తెచ్చింది: రేవంత్

TG: మూడోసారి టీ20 ప్రపంచకప్‌ను సొంతం చేసుకున్న టీమిండియాకు సీఎం రేవంత్ అభినందనలు తెలిపారు. ఈ విజయం దేశ ప్రజలందరికీ గర్వకారణమని పేర్కొన్నారు. మ్యాచ్ ఆరంభం నుంచి చివరి వరకు భారత జట్టు అత్యుత్తమ ఆట తీరును కనబరిచిందని కొనియాడారు. టీమిండియా సాధించిన ఈ విజయం దేశ క్రీడా రంగానికి గౌరవం తెచ్చిందని ప్రశంసించారు.