కాలనీలో ఫాగింగ్ నిర్వహించిన పోలీసు అధికారులు

ప్రకాశం: స్వర్ణాంధ్ర, స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం ఒంగోలు నగరంలోని మిలటరీ, యానాది కాలనీలో CI విజయకృష్ణ, ఎస్సైలు ఫిరోజ్, హరిబాబు, ప్రభాకర్‌లు దోమల నివారణకు ఫాగింగ్ నిర్వహించారు. నీరు నిల్వ ఉంచకుండా చేయడం, దోమలు గుడ్లు పెట్టకుండా చూడడంతోపాటు ఫాగింగ్‌పై అవగాహన కల్పించారు. డివిజన్ అధ్యక్షుడు నల్లూరి రవి నేతృత్వంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.